Waltair Veerayya | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) థియేటర్లలో సందడి చేసే సమయం దగ్గరపడుతోంది. త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా పక్కా మాస్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు ముస్తాబవుతున్నాడు. జై లవకుశ, పవర్, వెంకీ మామ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
వాల్తేరు వీరయ్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్టు ఇప్పటికే వార్తలు రాగా.. సీబీఎఫ్సీ ఈ చిత్రానికి జారీ చేసిన క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ కాపీ బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం వాల్తేరు వీరయ్య రన్ టైం ఎంతనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం రన్ టైం 2 గంటల 40 నిమిషాలు. ఈ లెక్కన సిల్వర్ స్క్రీన్‌పై చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ టీం ఎంటర్ టైన్ మెంట్ మామూలుగా ఉండదని తెలిసిపోతుంది.
ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు, టైటిల్ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..