Maa elections | ఒక్క ఓటమితోనే మెగా ఫ్యామిలీ సత్తా తగ్గిపోతుందా..?

Mega family | మా ఎన్నికలు ( MAA elections ) పూర్తయిపోయి మూడు రోజులు అయిపోతుంది. కానీ ఇప్పటికీ వాటి గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా మంచు విష్ణు గెలిచిన తర్వాత జరుగుతున్న పరిణామాలు.. ఎదురవుతున్న పరిస్థితులను చూస్తుంటే రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. దానికి తోడు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తీసుకున్న రాజీనామాల నిర్ణయం కూడా సంచలనం రేపుతుంది. ప్రాంతీయ భావం, సంకుచితత్వం ఉన్న చోట తాను ఉండలేనంటూ ప్రకాశ్ రాజ్ రాజీనామా చేశారు. ఆయనే కాదు నాగబాబు లాంటి వాళ్లు కూడా మా అసోసియేషన్ కు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను మోహన్ బాబు వర్సెస్ చిరంజీవిగా చాలామంది అభివర్ణించారు. ఎందుకంటే చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ ను మంచు విష్ణు ఇప్పుడు ఓడించాడు. దీంతో టాలీవుడ్లో, మా అసోసియేషన్‌లో మెగా ఫ్యామిలీ హవా ఎలా ఉండబోతుందని ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
మా ఎన్నికలు ( MAA elections ) ఎలా జరిగాయి అనే విషయంపై ఇప్పుడు మాట్లాడుకుని వేస్ట్ అంటున్నారు విష్ణు వర్గం. మరోవైపు రౌడీయిజం, బెదిరింపులతోనే మా ఎన్నికల్లో వాళ్లు గెలిచారు అంటున్నది ప్రకాశ్ రాజ్ ప్యానల్. ఏదేమైనా చిరంజీవిపై మోహన్ బాబు గెలిచాడు.. ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో మోహన్ బాబు హవా నడుస్తుంది.. మంచు కుటుంబం చెప్పిందే జరుగుతుంది.. అని టాలీవుడ్లో కొంతమంది చెప్పుకుంటున్నారు. అంతెందుకు మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు కొందరు సీనియర్ నటుడు నరేశ్. మోహన్ బాబును మరో దాసరి నారాయణ రావుతో పోల్చాడు. కేవలం ఒకే ఒక్క ఎన్నికలు ఓడిపోయిన అంతమాత్రాన మెగా ఫ్యామిలీ సత్తా టాలీవుడ్లో తగ్గిపోతుందా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మా అసోసియేషన్ మొదలుపెట్టి 25 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు చిరంజీవి సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయింది లేదు. కానీ తొలిసారి ఆయన చెప్పిన వాడు కాకుండా మరొకరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దాంతో మాలో చిరంజీవి ఫ్యామిలీ ఆధిపత్యానికి తెరపడింది అంటూ కొందరు చెబుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు.. వచ్చే ఎన్నికల నాటికి చిరంజీవి అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది అంటూ మా సభ్యులు కొందరు జరగబోయేది చెప్తున్నారు. ఏదేమైనా కూడా కేవలం ఒకే ఒక్క ఓటమి మెగా ఫ్యామిలీ సత్తా తెలియజేస్తుంది అంటే ఎవరు నమ్మరు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ముక్కలైపోతున్న మా అసోసియేషన్.. సో కాల్డ్ సినీ పెద్దలేం చేస్తున్నారో..?
Allu Arjun | ‘మా’ ఎన్నికలకు అల్లు అర్జున్ డుమ్మా..కారణమిదే..!
కాను కానంటూనే సినీ పెద్దవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు !
Mohan Babu | నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు: మోహన్ బాబు
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Nagendra Babu | నాగబాబు రాజీనామా..దాసరి లోటు మోహన్‌బాబు భర్తీ చేస్తారన్న నరేశ్
Prakash Raj | అతిథిగానే ఉండాలంటున్నారు: ప్రకాశ్ రాజ్
mega family | మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

