Waltair Veerayya Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘వాల్తేరు వీరయ్య’ హంగామే కనిపిస్తుంది. వింటేజ్ లుక్‌లో మెగాస్టార్‌ను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. కథ పాతదే అయినా, కథనం కొత్తగా ఉందని, యాక్షన్ సన్నివేశాలు, బాస్ కామెడీ టైమింగ్ చాలా బాగుందని రివ్యూలు వస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తోలిరోజే దాదాపు రూ. 30 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ సినిమాకు రిలీజ్ ముందు నుండే మంచి బజ్ ఏర్పడించింది. పోస్టర్ల దగ్గర నుండి టీజర్, ట్రైలర్లు ఇలా ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. పైగా రవితేజ కీలకపాత్ర పోషించిడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.
తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. సక్సెస్ మీట్లో భాగంగా చిరు సినిమాగురించి పలు ఆసక్తిర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. రవితేజ క్యారెక్టర్ ఈ సినిమాలో చనిపోతుంది. కాగా ఈ సీన్లో చిరు గ్లిజరిన్ కూడా వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్నా అని తెలిపాడు. ఆ ఎమోషనల్ సీన్ చేసే సమయంలో నిజానికి రవితేజ కాకుండా ఇంకెవరైనా ఆంటే కన్నీళ్లు వచ్చేవి కావేమో అని చెప్పుకొచ్చాడు. రవితేజను తమ్ముడిగా భావించడం వల్లే అలా గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు వచ్చాయని చిరు, రవితేజపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్స్ అన్ని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని మెగాస్టార్ పేర్కొన్నాడు.
అన్నయ్య సినిమా తర్వాత దాదాపు ఇరవై మూడేళ్లకు వీరిద్ధరూ కలిసి వెండి తెరను పంచుకున్నాడు. మధ్యలో శంకర్‌దాదా జిందాబాద్లో ఓ పాటలో రవితేజ అలా కనిపించి వెళ్లిపోయాడు. మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్ధరూ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఇద్దరి హీరోల అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు.