అందరూ జాగ్రత్తగా ఉండండి!

కరోనా సెకండ్‌వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైరస్ బాడిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి వల్ల ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ర్టాల్లో లాక్డౌన్ విధించారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా ఉండండి. ఇంటి నుంచి అస్సలు బయటకు రావొద్దు. అత్యవసరమై బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ తర్వాత కరోనా సోకినా ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఆందోళనకు గురికావొద్దు. భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐసోలేషన్‌కి వెళ్లండి. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. కరోనా నుంచి బయటపడిన తర్వాత నెలరోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి. ప్లాస్మాదానం చేస్తే ఒక్కొక్కరు ఇద్దరిని కాపాడిన వారవుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండండి’ అని ఆయన కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

