టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్టు మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ (Saimanjrekar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
అంతేకాదు అడివిశేష్ టీంను లంఛ్కు ఆహ్వానించారు. ఈ విషయాన్ని అడివిశేష్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. నేడు అత్యున్నత గౌరవంగా భావిస్తున్నా. మీరు మాతో గంటలపాటు మాట్లాడారు. అద్బుతమైన లంఛ్ ఏర్పాటు చేశారు. సినిమాలో మీకు ఏ విషయం బాగా నచ్చిందో వివరించారు. మీ మనస్సు ఎంత బంగారమో ఇవాళ తెలిసింది..ఎంతో శ్రద్దతో మీరు తెలివైన ప్రశ్నలు వేశారు. మెగాస్టార్ అంటే నాకెప్పుడూ ఇష్టం..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు అడివిశేష్.
Read Also : Kamal Chiru | కమల్ హాసన్, చిరంజీవి అప్పుడు..ఇప్పుడు..ట్రెండింగ్లో స్టిల్
Read Also : Sai Dharam Tej | లైట్స్ అండ్ షాడోస్..సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..