Chiranjeevi Latest Photos Viral | క్లాస్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈయన సహ నటులు ఒకటి రెండు సినిమాలను లైన్లో పెడితే ఈయన మాత్రం నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా చిరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తాజాగా చిరు ఓ ఫోటోషూట్ చేశాడు. ఫోటోషూట్‌లో భాగంగా పలు కాస్ట్యూమ్స్ ధరించి కెమెరాకి ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలలో చిరు క్లాస్‌లుక్‌లో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్, ఎవర్ గ్రీన్ అఫ్ టాలీవుడ్, అటు క్లాస్ అయినా.. ఇటు మాస్ అయినా బాస్ తరువాతే ఎవరైనా అంటూ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. దీనితో పాటుగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య(టైటిల్ ఇంకా పరిశీలనలో ఉంది) సినిమాను చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరు అండర్ కవర్ కోప్గా కనిపించనున్నాడు. ఇవే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నాడు. కీర్తిసురేష్ ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా నటిస్తుంది.
Be it Mass or Class he is the "BOSS" 🔥🔥
Megastar @KChiruTweets looks suave in these clicks..his style and charm are irreplaceable 💥💥🤙🤙#Chiranjeevi #BholaaShankar #GodFather #Mega154 #MegastarChiranjeevi pic.twitter.com/l81BLawUK6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 7, 2022