హైదరాబాద్: అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న కైకల.. స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానన్నారు. నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు. కైకాల పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం కలిగిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నదని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృదం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నదని చెప్పారు.
#GetWellSoonKaikalaGaru #KaikalaSatyanarayana#NavaRasaNatanaSarvabhouma pic.twitter.com/Log3ohKtnz
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2021