Chiranjeevi | రాంచరణ్ బర్త్ డే స్పెషల్.. ఆస్కార్ విజేతలకు చిరంజీవి సత్కారం
Chiranjeevi | చిరంజీవి (Chiranjeevi) నివాసంలో రాంచరణ్ పుట్టినరోజు (Ram Charan birthday) వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్ డే ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ టీం (RRR Team) కూడా సందడి చేసింది.
Chiranjeevi | టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ పుట్టినరోజు (Ram Charan birthday) సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) తన కుమారుడికి ఆప్యాయంగా ముద్దు పెడుతూ శుభాకాంక్షలు తెలిపిన ఫొటో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా చిరంజీవి నివాసంలో రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈవెంట్లో పాల్గొన్నారు. బర్త్ డే ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ టీం (RRR Team) కూడా సందడి చేసింది.
‘నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి టీంను చిరంజీవి ఘనంగా సత్కరించాడు. రాంచరణ్ బర్త్ డే వేడుకల్లో ప్రముఖుల సమక్షంలో మన ఆస్కార్ విజేతలను సత్కరించుకోవడం గొప్ప గౌరవంగా ఫీలవుతున్నా. భారతీయ సినిమా కోసం తెలుగువారు సాధించిన ఈ అరుదైన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది.. అని‘ ట్వీట్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Chiranjeevi
బర్త్ డే ఈవెంట్లో అక్కినేని నాగార్జున, వెంకటేశ్, నాగచైతన్య, అఖిల్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యేర్నేని, రవి శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు, డీవీవీ దానయ్య, బీవీఎస్ఎస్ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, ఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆస్కార్ విజేతలకు సత్కారం
Honouring our Oscar winners in the presence of near and dear on @AlwaysRamCharan ‘s birthday was a true celebration! This feat Telugus achieved for the Indian Cinema shall remain etched in history!! @TheAcademy #OscarsForIndianCinema #Oscars95 #TeluguCinema pic.twitter.com/menKXI5jKh
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 28, 2023
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

