Chiranjeevi Dance Practice Session | డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్లో చిరంజీవి..ఇంతకీ ఏ సినిమాకంటే..?
టాలీవుడ్ (Tollywood)లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరు శేఖర్ మాస్టర్ (Shekhar master). ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో మరోసారి పాట కంపోజ్ చేస్తున్నాడు.

టాలీవుడ్ (Tollywood)లో ఉన్న టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరు శేఖర్ మాస్టర్ (Shekhar master). సినిమాలో మాస్ సాంగ్ ఉందంటే చాలు మేకర్స్ కు శేఖర్ మాస్టర్ ఠక్కున గుర్తొస్తాడు. ఖైదీ నంబర్ 150, ఆచార్యలో ఇప్పటికే సాంగ్స్ కు నృత్య రీతులు సమకూర్చిన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో మరోసారి పాట కంపోజ్ చేస్తున్నాడు. మెహర్‌రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bholaa Shankar).
చిరంజీవితో ఓ సాంగ్ ప్రాక్టీస్ సెషన్ (Chiranjeevi Dance Session)లో దిగిన ఫొటోను శేఖర్ మాస్టర్ షేర్ చేశాడు. చిరు బ్లాక్ టీ షర్టులో ఉండగా..వైట్ టీ షర్ట్‌లో ఉన్న శేఖర్ మాస్టర్ చిరు చేయి పట్టుకుని దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ పాట చిత్రీకరణలో కూడా జాయిన్ కాబోతున్నాడట చిరు. ఈ సారి మాస్ బీట్‌ను అందించబోతున్నట్టు ఇన్ స్టా ద్వారా చెప్పాడు శేఖర్ మాస్టర్. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
కొరటాల శివతో చేస్తున్న ఆచార్య విడుదలకు సిద్దంగా ఉంది. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్ ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ అయింది. మరోవైపు మోహన్ రాజ్ డైరెక్షన్లో లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Jr NTR New Movies Update | తన కొత్త సినిమాల గురించి చెప్పిన ఎన్టీఆర్
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

