Bhola Shankar | మెగా సెలబ్రేషన్స్ టైం.. భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు మేకర్స్. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ న్యూస్ బయటకు వచ్చింది.
Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). మెహర్‌రమేశ్ దర్శకత్వంలో వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. భోళాశంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు మేకర్స్. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ న్యూస్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆగస్టు 6న సాయంత్రం 7 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
మెగా సెలబ్రేషన్స్ టైం వచ్చేసింది.. అంటూ చిరు, తమన్నా సాంగ్ లుక్‌తో మేకర్స్ విడుదల చేసిన ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పాటలు, టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. ఈ చిత్రంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
భోళా శంకర్‌లో చిరంజీవి సోదరి పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి మరోవైపు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ రీమేక్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
It’s time for the MEGA celebrations 😎🤘
Grand #BholaaShankar Pre-Release Celebrations on August 6th at Shilpakalavedika, Hyderabad from 7PM onwards💥💥
Mega 🌟 @KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @SagarMahati… pic.twitter.com/DMwjq4pKET— AK Entertainments (@AKentsOfficial) August 3, 2023
భోళాశంకర్ ట్రైలర్..
మిల్కీ బ్యూటీ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

