గోవాలో 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (53rd International Film Festival of India) నేడు గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 గా చిరంజీవి ఎంపికయ్యారు. చిరంజీ నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి..అద్బుతమైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని.. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రజాదరణ పొందారు. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన చిరంజీవిగారికి శుభాకాంక్షలు అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
2013లో తొలిసారి…
ఈ అవార్డును 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తొలిసారి నెలకొల్పారు. భారతీయ సినీ పరిశ్రమలో చేసిన సేవలకు, ఇండస్ట్రీ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ పురస్కారం ప్రకటిస్తారు. చిరంజీవి కంటే ముందు అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, హేమ మాలిని, ఇళయ రాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ అవార్డు అందుకున్నారు.
నేటి నుంచి ఈ నెల 28వరకు చలన చిత్రత్సోవాలు కొనసాగనున్నాయి. ఈ ఈవెంట్ పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో మొదలైంది.తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ ఈవెంట్లో 79 దేశాల నుంచి మొత్తం 280 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో 25 ఫీచర్ సినిమాలు, 20 నాన్-ఫీచర్ సినిమాలు ప్రదర్శించనున్నారు.
Indian Film Personality of the Year 2022 award goes to 𝐌𝐞𝐠𝐚𝐬𝐭𝐚𝐫 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢
With an illustrious career spanning almost four decades, he has been a part of more than 150 feature films
📽️https://t.co/1lSx81bGMw#IFFI #AnythingForFilms #IFFI53 @KChiruTweets pic.twitter.com/AY6UzMhfix
— PIB India (@PIB_India) November 20, 2022
INDIAN FILM PERSONALITY @IFFIGoa
Sh Chiranjeevi Ji has had an illustrious career spanning almost four decades, w/ over 150 films as an actor, dancer & producer.
He is immensely popular in Telegu Cinema w/ incredible performances touching hearts!
Congratulations @KChiruTweets! pic.twitter.com/ZIk0PvhzHX
— Anurag Thakur (@ianuragthakur) November 20, 2022
Read Also : Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాలహారం.. కృతిశెట్టి ఫొటోలు వైరల్
Read Also :Matti Kusthi Trailer | ప్రేమ వర్సెస్ కుస్తీ.. విష్ణువిశాల్ మట్టి కుస్తీ ట్రైలర్
Read Also :Hrithik Roshan | క్యూరియాసిటీ సహజమే.. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదు: హృతిక్ రోషన్