Chiranjeevi – Anil Ravipudi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుస సినిమాలకు ఒకే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా ఒకే చేసిన మెగాస్టార్ మరో క్రేజీ కాంబోను లైన్లో పెడుతున్నాడు. పటాస్, ఎఫ్ 2, ఎఫ్3 సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు.
అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. సినీ ప్రముఖుల సమక్షంలో జనవరి 15న పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్. షైన్స్క్రీన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.