Pelli sandadi | అందులోనే కిక్ ఉంటుంది

‘ప్రతి నటుడికి భరోసానిస్తూ వారికి స్టార్ ఇమేజ్ను అందించడంలో దిగ్దర్శకులు రాఘవేంద్రరావుగారు ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన పట్ల గురుభావన ఉంటుంది. నా కెరీర్ ఉన్నతిలో ఆయన తోడ్పాటు మరువలేనిది’ అన్నారు అగ్రనటుడు చిరంజీవి. ఆదివారం జరిగిన ‘పెళ్లిసందడి’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శ్రీకాంత్ తనయుడు రోహన్, శ్రీలీల జంటగా కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లిసందడి’. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. చిరంజీవి మాట్లాడుతూ ‘శ్రీకాంత్ నటించిన ‘పెళ్లిసందడి’ మాదిరిగా ఈ చిత్రం కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. రాఘవేంద్రరావుగారి లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో ఉండటం అదృష్టమని వెంకటేష్ చెప్పారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఈ సినిమాలో చిన్న పాత్ర చేయడం సంతోషంగా ఉంది. కొత్తవాళ్లతో సినిమా చేస్తే ఓ కిక్ ఉంటుంది’ అన్నారు. రాఘవేంద్రరావు చేతుల మీదుగా తన కుమారుడు హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని, ప్రేక్షకులు రోహన్‌ను ఆశీర్వదించాలని శ్రీకాంత్ కోరారు. రాఘవేంద్రరావు సాధించిన విజయాల్లో పదిశాతం సాధిస్తే చాలనే భావన కలుగుతున్నదని దిల్‌రాజు చెప్పారు. ఈ సినిమా ద్వారా తాను ఎన్నో విషయాల్ని నేర్చుకున్నానని హీరో రోషన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

