Chinna | తెలుగు సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘శివ’ ప్రత్యేక స్థానం పొందింది. సినిమా మేకింగ్, కథ, స్క్రీన్‌ప్లే, హీరోయిజం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ ప్రతి అంశంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచింది. ఈ చిత్రం 4K రీ-రిలీజ్ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన జితేంద్ర రెడ్డి అలియాస్ చిన్నా తన కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చిన్నా అసలు పేరు ఆరుగుంట జితేంద్ర రెడ్డి. ‘శివ’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత మధురా నగరి, చైతన్య, లాఠీ, అల్లరి పిల్ల, మనీ, మనీ మనీ,ఆంటీ, మురారి వంటి అనేక చిత్రాల్లో నటించారు.
నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారు. అయితే కెరీర్లో తనను ఇబ్బంది పెట్టిన సినిమాలలో ‘అమ్మోరు’ చిత్రం ఉంటుందని తెలిపారు. నాకు ‘అమ్మోరు’ సినిమాతో చేదు అనుభవం ఎదురైంది. మొదట ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్రను నాతో చేయించాలని యేలేటీ రామారావు గారు నిర్ణయించారు. కథ చెప్పి, స్ఫూర్తి పొందిన ఇంగ్లీష్ సినిమాను కూడా చూపించారు. పాత్రకు తగ్గట్టుగా నేను వేసిన గెటప్స్‌కి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. మనీ సినిమా ముగింపు దశలో ఉండడంతో, నేను వెంటనే గుండు చేయించుకోలేనని చెప్పా. రాము గారు రెండు ప్రత్యేక షెడ్యూల్స్ జోడించి ‘మనీ’ని త్వరగా ఫినిష్ చేసి ‘అమ్మోరు’కి పంపించారు,
లండన్ నుండి కెమెరామెన్ వచ్చాక ఖాజాగూడలో నెల రోజులు క్లైమాక్స్ చిత్రీకరించాం. ఏడాదిన్నర పాటు చాలా కష్టపడ్డాను, ఒక గ్రాఫిక్స్ సీన్ కోసం నేను ఒక్కడినే పద్మాలయా స్టూడియోలో 72 గంటల పాటు నిద్రపోకుండా పనిచేశానని చిన్నా అన్నారు. యేలేటి రామారావు రష్ చూశాక నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లమ్ లేదు. అయితే టెక్నికల్‌గా షాట్ మేకింగ్‌లో ఆయన అనుకున్న విజన్ రావడం లేదు. బాగా డిజప్పాయింట్ అయిపోయి.. ఈ సినిమాను ఏం చేయాలా? అని కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లా. ఆయన సినిమా అంతా చూసి .. చిన్నా విలన్ ఏంటీ అని అడిగారు. చిన్నా పెద్ద కామెడీ స్టార్.. దీనిని నేనేం చేయలేను అని అన్నారు. చిన్నాని మార్చేసి వేరే వాళ్లని పెట్టండి.. అతని పారితోషికం ఇప్పిస్తానని చెప్పారు.
నన్ను, మదర్ క్యారెక్టర్‌గా చేసిన నాగరత్నంను కూడా తీసేసి వడివుక్కరసితో చేయించారు. ఈ దెబ్బతో నేను చాలా డిజప్పాయింట్ అయి, ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదానుకున్నా. ఈ సినిమా చేస్తుండగానే పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండో రోజే షూటింగ్‌కి వెళ్లిపోయా. అమ్మోరు సినిమా కోసం రాము గారి గాయం కూడా వదిలేశా. ఈ బాధ వల్లే నేను చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిప్ట్ కాలేదు. దాదాపు నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నానని చిన్నా ఆవేదన వ్యక్తం చేశారు.