ఒంటరిగా అతడిని కలవకు!
మీటూ వేదికగా సినీరంగంలోని లైంగిక వేధింపులపై గళం విప్పి వార్తల్లో నిలిచింది గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించాయి.
మీటూ వేదికగా సినీరంగంలోని లైంగిక వేధింపులపై గళం విప్పి వార్తల్లో నిలిచింది గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించాయి. తాజాగా వైరముత్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అతడిని ఒంటరిగా అస్సలు కలవొద్దు అంటూ యువ నటి అర్చనను హెచ్చరిస్తూ చిన్మయి చేసిన కామెంట్స్ ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ‘రాజా రాణీ’ అనే సీరియల్‌తో తమిళనాట మంచి పాపులారిటీ సంపాదించుకుంది అర్చన. ప్రస్తుతం ఆమె సినిమాల్లోనూ నటిస్తున్నది. ఇటీవల అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. అక్కడ సెట్లో వైరముత్తుతో తీయించుకున్న ఫొటోల్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. తానొక గొప్ప వ్యక్తిని కలిశానంటూ ఆనందం వ్యక్తం చేసింది. దీనిపై చిన్మయి స్పందించింది. వైరముత్తు తొలుత హుందాగా వ్యవహరిస్తూ గొప్ప వ్యక్తిగా కనిపిస్తాడని, ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుందని చెప్పింది. అతడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా వెళ్లి ఎప్పుడూ కలవకూడదని సూచించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- chinmayi
- vairamuthu
- VJ Archana
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

