ఒకప్పుడు వెండితెరపై అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్న ఛార్మి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాను. కాని నా వల్ల అది కావడం లేదు. మన దేశ పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. అందుకే సోషల్ మీడియాకు కొద్ది రోజులకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ చేతులెత్తి వేడుకుంది.
కరోనా విలయతాండవాన్ని చూడలేకపోతున్నాను. పరిస్థితి భయంకరంగా మారుతుంది. దురదృష్టవశాత్తు వీటన్నింటిని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించే వారిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఛార్మి తన పోస్ట్‌లో పేర్కొంది.
I try to keep everyone’s energy high , but I now give up 🙏🏻 our country is in very bad condition 😔😔😔
— Charmme Kaur (@Charmmeofficial) April 19, 2021
Take care guys 🙏🏻🙏🏻#stayhome #staysafe #covid_19 #2021 pic.twitter.com/LR7UxIA4sx