Guntur kaaram | మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న క్రేజీ చిత్రాల్లో ఒకటి గుంటూరు కారం. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్గా విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. నెక్ట్స్ మేజర్ షెడ్యూల్‌ను జూన్ 12న మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది.
అయితే నేటి నుంచి ప్రారంభం కావాల్సిన గుంటూరు కారం తాజా షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయని, జూన్ 16 నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుందని తాజాగా మరో వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ కొనసాగనుంది. మహేశ్ బాబు, ఇతర లీడ్ యాక్టర్లపై వచ్చే హై వోల్టేజీ యాక్షన్ సీక్వెన్స్ ను షురూ చేయబోతున్నారట.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..