Nayanthara Documentary | లేడి సూపర్‌స్టార్ నయనతార మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ (Nayanthara Beyond The FairyTail)’ ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్(Naanum Rowdy Dhaan)’ సినిమా క్లిప్‌లను ఉపయోగించారని ఆ సినిమా నిర్మాత ధనుష్(Actor Dhanush) అప్పట్లో నయనతారపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. అయితే ఈ వివాదం ముగియకముందే తాజాగా మరో కేసులో ఇరుక్కుంది నయన్. ఈ డాక్యుమెంటరీలో తమ అనుమతి లేకుండా ‘చంద్రముఖి(Chandramukhi)’ సినిమాలోని క్లిప్‌లను ఉపయోగించారంటూ ‘ఏపీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
‘చంద్రముఖి’ సినిమా హక్కులు తమ వద్ద ఉన్నాయని, తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఆ సినిమా క్లిప్‌లను వాడారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కు రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ వివాదంపై సమాధానం ఇవ్వాలని నయనతార, నెట్‌ఫ్లిక్స్‌లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ 6 లోపు స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ రెండు వివాదాలతో నయనతార డాక్యుమెంటరీ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.