ChandraBose | గేయరచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం.. సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో మృతి
ChandraBose | ప్రసిద్ధ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ChandraBose | ప్రసిద్ధ గేయరచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అన్నమయ్య జిల్లాలోని కలికిరి ప్రాంతానికి చెందిన రాజేంద్ర, వ్యాపార పనుల నిమిత్తం బెంగళూరు నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేసినట్లు సమాచారం.
ఆదివారం ఉదయం ఆయనకు స్వల్ప అసౌకర్యం కలగడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే కొంతసేపటికి ఆరోగ్యం బాగానే ఉందని భావించి బయటకు వచ్చారు. అనంతరం కలికిరి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్లో టిఫిన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. అక్కడున్న వారు వెంటనే స్పందించి సమీప వైద్యులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజేంద్ర మృతితో కలికిరి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చంద్రబోస్ కుటుంబానికి తమ సానుభూతి తెలియజేశారు. ఇక కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా, రాజేంద్ర మృతి పట్ల స్థానిక ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. అంతర్జాతీయ వేదికలపై తెలుగు ప్రతిష్ఠను నిలబెట్టిన చంద్రబోస్ కుటుంబంలో ఇలా అకస్మాత్తుగా విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చంద్రబోస్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

