Pushpa 2 – Chaava | అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. బాలీవుడ్లో పుష్ప 2 సోలోగా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అల్లు అర్జున్‌కు పోటిగా వస్తున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇదే రోజున బాలీవుడ్ నుంచి మరో ప్రెస్టీజియస్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఛావా(Chhaava). ఈ సినిమాను డిసెంబర్ 06న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమాకు ఉన్న క్రేజ్‌కి ఛావా తగ్గినట్లు తెలుస్తుంది. పుష్ప, ఛావా రెండు ఒకేసారి విడుదల అయితే సింగిల్ స్క్రీన్ డిస్ట్రిబ్యూటర్లు అంతా పుష్ప సినిమాకే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. దీంతో ఛావా సినిమాకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
మరోవైపు కరోనా లాక్డౌన్ అనంతరం ఉత్తరాదిన మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్ని పుష్ప సినిమాతోనే తెరచుకున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ పుష్ప సినిమాకే ఓటు వేసినట్లు తెలుస్తుంది. ఇక ఛావా మేకర్స్ కూడా పుష్ప 2 కు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని విడుదలను వాయిదా వేయనున్నట్లు సమాచారం.