Superman Movie | సినిమా సెన్సార్‌పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన మోహన్‌లాల్ L2 ఎంపురాన్(L2 Empuraan) సినిమాతో పాటు, ఇటీవల వచ్చిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (JSK) సినిమాలకూ సెన్సార్ పలు కోతలు సూచించిన విషయం తెలిసిందే. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయాలపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఇండియాలో తాజాగా విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘సూపర్‌మ్యాన్’ సినిమాలో కూడా 33 సెకన్ల రొమాన్స్ సన్నివేశాన్ని CBFC తొలగించడంపై సినీ ప్రియులు, విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇష్టానుసారం కత్తిరించడం వల్ల సినిమా తన సహజత్వాన్ని కోల్పోతుందని, కొన్ని చోట్ల సన్నివేశాలు అర్థం కాకుండా ఉన్నాయని ఇటీవల ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు పేర్కొన్నారు.
అయితే సెన్సార్ తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయాలపై నటి శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తంచేశారు. సూపర్‌మ్యాన్ సినిమాలో సెన్సార్ కట్ చేసింది నిజమైతే, ఈ ఘటన తనకు నవ్వు తెప్పిస్తుంది అన్నారు. ప్రతిరోజూ ఏదో ఒక అనవసరమైన విషయం మన దృష్టికి వస్తుందని, ఇది మనకున్న సమస్యల్లో చిన్నదే కావచ్చు కానీ మిగతా పెద్ద సమస్యల గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా అంటే లేదు. ఇలానే ప్రతిరోజూ ఏదో ఒక చెత్త విషయం జరుగుతూనే ఉందంటూ శ్రేయా తన ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రేయా సినిమాల విషయానికి వస్తే, తెలుగులో నాగ చైతన్య ‘జోష్’ సినిమాతో పాటు ‘స్నేహగీతం’ సినిమాలో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ శ్రేయాకి మంచి గుర్తింపును తీసుకువచ్చింది.
If this is true, this is RIDICULOUS!!! Some ridiculous crap happens every day. Every. Damn. Day.
Sure this is the least of our worries but is something done about anything else? There is some crap every day. Every. Damn. Day. https://t.co/Kwg7fKSe0M
— Shreya Dhanwanthary (@shreyadhan13) July 11, 2025