వరుణ్‌సందేశ్, గగన్, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘CASTE’. ఏకే జంపన్న దర్శకుడు. తోట లక్ష్మీకోటేశ్వరరావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ‘మినిస్టర్ నారాయణ’గా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రాజారవీందర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువాతో ఠీవాగా కనిపిస్తున్న రాజారవీందర్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. కశికా కపూర్, దివి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, పృథ్వీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: గోల్డెన్ ప్రొడక్షన్స్.