దళితులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ

ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలిచే తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితులని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన మీరా.. దళిత డైరెక్టర్ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది.
ఒక డైరెక్టర్ నా అనుమతి లేకుండా ఫొటోని దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు అని చెప్పుకొచ్చిన మీరా . .దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని, షెడ్యూల్ కులాల వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగక తమిళ సినీ పరిశ్రమలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లు బయటకు వెళ్లిపోవాలని వారి వల్లే క్వాలిటీ సినిమాలు రావడం లేదని ఆవిడ వ్యాఖ్యలు చేశారు.
మీరా వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారగా, దీనిపై తమిళనాడు కు చెందిన దళిత పక్షపాత పార్టీ వి ఎస్ కె ఈవిడ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళితులను కించపరిచేలా ఈవిడ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరింది. వీడియో ఆధారంగా పోలీసులు కూడా మీరాపై కేసు నమోదు చేశారు.
2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటం అందుకున్న ఈ అమ్మడు అందరి దృష్టి ఆకర్షించింది. 2018 సంవత్సరంలో ఒక మ్యాగజైన్ కు తాను ఇచ్చిన టాప్ లెస్ ఫోటో అప్పట్లో సంచలనం సృష్టించింది . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ఎంతవాడుగాని సినిమాలో ఆవిడ ఒక పాత్ర చేసింది. పలు సినిమాలోలోను కీలక పాత్రలు చేస్తున్న మీరా2019 లో బిగ్ బాస్ తమిళ్లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

