Captain Miller Movie Teaser | ఇప్పుడున్న సౌత్ హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తున్నాడంటే అది ధనుష్ మాత్రమే. ఏడాదికి రెండు, మూడు రిలీజ్లు ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా అని తన సినిమాలేం జనాల మీద ఊరికే రుద్దేలా ఉండవు. మంచి కథతో.. ఆసక్తి పెంచే కథనంతో ఆలోచించే విధంగా ఉంటాయి. ఇక తిరు, సార్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్లు కొల్లగొట్టి తమిళ్లో టాప్ హీరో రేంజ్‌కు ఎగబాకాడు. ప్రస్తుతం ధనుష్ కేప్టెన్ మిల్లర్ అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది.
ధనుష్ బర్త్‌డే సందర్భంగా అర్ధరాత్రి పన్నెండుగంటల సమయానికి ఈ సినిమా టీజర్ రిలీజైంది. కాన్సెప్ట్‌ను పెద్దగా రివీల్ చేయలేదు కానీ.. టీజర్ స్టార్టింగ్‌లో వాంటెడ్ అంటూ ధనుష్‌ను పట్టిస్తే పదివేల రూపాయలు నజరానా అని పోస్టర్‌ను చూపించారు. దాంతో బ్రీటీష్ సైన్యంపై ఎదురు తిరిగినందుకు ధనుష్‌పై కక్ష్య సారిస్తారని స్పష్టమైంది. టీజర్‌ను గమనిస్తే.. ఒక మారుమూల గిరిజన తండాపై ఇంగ్లీష్ సైన్యం దాడి చేస్తుంది. వాళ్లకు అడ్డుగా ధనుష్ ఎదురెళ్తాడు. ఒక విప్లవకారుడి మాదిరి వాళ్ళతో తలపడి విధ్వంసం సృష్టిస్తాడు. చేతికి దొరికిన ఆయుధంతో బ్రీటీష్ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన కథ ఇది. దానికి తగ్గట్లే పీరియాడిక్ సెటప్‌లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ధనుష్ రా, రస్టిక్ లుక్‌లో అదిరిపోయాడు.
ఇక ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలతో మెప్పించిన ప్రియాంకకు ఈ సారి చేతికి గన్ ఇచ్చి మంచి స్కోప్ ఉన్న రోల్ పడ్డట్లు తెలుస్తుంది. ఇక టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, సాండల్ వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్స్‌లో కాకుండా కథకు కీలకం కాబోతున్నట్లు తెలుస్తుంది. జీవి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మాత్రం వీర లెవల్లో ఉంది. ముఖ్యంగా సిద్దార్థ నుని సినిమాటోగ్రఫి హై స్టాండర్డ్‌లో ఉంది. మొత్తంగా టీజర్ మాత్రం గూస్బంప్స్ తెప్పి్చ్చింది. అరుణ్ మాతేశ్వరణ్ నుంచి ఈ రేంజ్ అవుట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.