గురువారం జరిగిన ‘వెంటాడు- వేటాడు’ అనే కెప్టెన్సీ టాస్క్ జరగగా, ఇందులో థర్మాకోల్ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్ గీసి ఉన్న ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. సర్కిల్ బయటకు వచ్చిన వారు ఔట్ అయిపోయినట్టు. గేమ్‌లో శ్రీరామ్, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్ పోటీపడ్డారు. ఫస్ట్ బజర్ మోగినప్పుడు శ్రీరామ్, సన్నీ పోటిపడ్డారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది.
‘సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా.. ఓడిపోయినవ్, అందుకే బయటున్నవ్..’ అని పదేపదే చెప్తూ అతడు మండిపోయేలా చేశాడు. గాల్లో ముద్దులు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. తర్వాతి రౌండ్లో శ్రీరామ్, మానస్‌ను కింద పడేయగా సంచాలకుడైన జెస్సీ వీళ్లిద్దరూ అవుట్ అని ప్రకటించాడు. మానస్ అవుట్ కాదంటూ వాదించాడు సన్నీ.
తర్వాతి రౌండ్లో ముగ్గురు మిగలగా షణ్ను, సిరి యానీని టార్గెట్ చేశారు. దీంతో యానీ.. ‘ఇండివిడ్యువల్ గేమ్ లేదు, నిజాయితీ లేదు’ అంటూ సిరిని నెట్టేసింది. అయితే ఆమె తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుకుంది. ఇది చూసి షాకైన ఇంటిసభ్యులు అది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. అయితే ఇంట్లో ఉన్నంత వరకు తాను కెప్టెన్ అవ్వను అంటూ ఏడ్చేసింది.
చివరి రౌండ్లో సిరిపై షణ్ముఖ్ విజయం సాధించి కెప్టెన్‌గా అవతరించాడు. దీంతో అతడికి హగ్గుల మీద హగ్గులిచ్చింది సిరి. మరోవైపు మానస్.. ఎవరెవరిని టార్గెట్ చేయాలో ఫిక్సయ్యానని సన్నీతో చెప్పుకొచ్చాడు. అటాక్ అంటే ఏంటో చూపిస్తానని ఫిక్సయ్యాడు మానస్.