Tamil Nadu CM | ‘సార్ మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?’.. ప్రోటోకాల్ పక్కన పెట్టి డాక్టర్ కోరిక తీర్చిన సీఎం విజయ్!
CM Joseph Vijay | చెన్నైలో నేడు జరిగిన ఆరోగ్య శాఖ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన మరియు ఆత్మీయ సంఘటన చోటుచేసుకుంది.
CM Joseph Vijay | చెన్నైలో నేడు జరిగిన ఆరోగ్య శాఖ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన మరియు ఆత్మీయ సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోవడానికి స్టేజ్ పైకి వచ్చిన ఒక జూనియర్ డాక్టర్, సీఎం విజయ్ను చూసిన ఆనందంలో సార్, మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా? అని అడిగారు. దానికి సీఎం విజయ్ ఎంతో సున్నితంగా, చిరునవ్వుతో స్పందిస్తూ అతడికి అనుమతి ఇచ్చారు. దీంతో ఆ డాక్టర్ ఎంతో సంతోషంతో ముఖ్యమంత్రిని కౌగిలించుకుని, తన నియామక పత్రాన్ని అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
తమిళనాడు వైద్యారోగ్య శాఖలో కొత్తగా ఎంపికైన 2,144 మంది అభ్యర్థుల కోసం చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 751 మంది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్, 1,393 మంది హెల్త్ ఇన్స్పెక్టర్లకు సీఎం విజయ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి విజయ్ ప్రోటోకాల్ పక్కన పెట్టి ఇలాంటి మానవీయ కోణంలోని ఘటనలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. గతంలో కూడా ఒక గర్భిణీ అభ్యర్థిని కోసం ఆయన స్టేజ్ దిగి కిందకు వచ్చి నియామక పత్రం అందించి వార్తల్లో నిలిచారు. సీఎం హోదాలో ఉంటూ కూడా అభ్యర్థులతో ఎంతో సాధారణంగా, ప్రేమగా మెలుగుతుండటంతో విజయ్ అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
751 உதவி மருத்துவ அலுவலர்கள், 1,393 சுகாதார ஆய்வாளர்களுக்கு பணி நியமன ஆணைகளை வழங்கினார் முதல்வர் விஜய்#CMVijay | #Vijay | #HealthDepartment pic.twitter.com/7IuZkjH8gi
— PttvOnlinenews (@PttvNewsX) July 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

