‘ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరి చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సూర్యవశిష్ట మాట్లాడుతూ ‘మా నాన్న సత్యంకు 30 ఏళ్ల పాటు పరిశ్రమతో అనుబంధం ఉంది. రాఘవేంద్రరావు, రాజమౌళి, త్రివిక్రమ్ దగ్గర ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. మలయాళ ‘కప్పెలా’ చూసిన నాన్న అందులో ఆటోడ్రైవర్ పాత్ర నాకు బాగా సరిపోతుందని చెప్పారు.
‘బుట్టబొమ్మ’ చిత్రం ద్వారా ఓ ఛాలెంజింగ్ పాత్ర దొరికింది. నేను సినిమాల్లోకి రావాలన్నది నాన్న కోరిక. ఆయన రెండేళ్ల క్రితం కరోనాతో మరణించారు. ఈ సినిమాతో నాన్న కల నిజం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు ఇష్టం. తదుపరి సినిమా కోసం కొందరు కొత్త దర్శకులు నన్ను సంప్రదిస్తున్నారు’ అని చెప్పారు.