Pushpa-2 Movie | రెండు జాతీయ అవార్డుల రావడంతో పుష్ప సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. బన్నీ ఫ్యాన్స్ సహా సినీ ప్రేమికులంతా సీక్వెల్ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా ఎప్పుడొచ్చిన బంపర్ హిట్టవడం ఖాయం అని అప్పుడే బాక్సాఫీస్ లెక్కలు కూడా వేసేస్తున్నారు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
పుష్ప సీక్వెల్లో బన్నీ చిరంజీవికి వీరాభిమానిగా కనిపించనున్నాడట. అంతేకాకుండా ఇంద్ర సినిమా రిలీజప్పుడు పుష్ప.. రష్మిక ఆలియాస్ శ్రీవల్లిని థియేటర్‌కు తీసుకొచ్చి సినిమా చూపించే సన్నివేశం ఒకటి ఉండబోతుందట. అంతేకాకుండా ఆ సీన్లో ఓ హత్య ప్రయత్నం కూడా జరగుతుందట. అదే టైమ్‌లో పుష్పరాజ్ విలన్లపై ఎదురుదాడికి దిగి మరణహోమం సృష్టిస్తాడట. ఈ సీన్‌కు గూస్బంప్స్ రావడం పక్కా అని ఇన్సైడ్ రిపోర్ట్స్. ఇది కేవలం లీకైన ముచ్చటనే. ఇక నిజంగానే ఈ సీన్ సినిమాలో ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడం ఖాయం.
ప్రస్తుతం సీక్వెల్‌కున్న క్రేజ్ చేస్తుంటే కొంచెం పాజిటీవ్ టాక్ వచ్చినా ఊహకందని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. మేకర్స్ సైతం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సరైనా ప్లానింగ్‌తో ప్రమోషన్లు గట్రా చేసి సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఇక బెస్ట్ యాక్టర్‌గా బన్నీకు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి మంగళవారం నేషనల్ అవార్డులు అందుకోబోతున్నారు.