అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అర్హ.. శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అర్హ ఓ కీలకపాత్రలో నటిస్తుంది. పది రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన అర్హ తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది.
అర్హ తిరిగి సినిమా షూటింగ్ లో జాయిన అయినే నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అల్లు అర్హ ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తోంది. భరతుడు పాత్రలో అర్హ ఒదిగిపోయిందనే టాక్ వినిపిస్తుంది.
అర్హ నటనను ప్రత్యక్షంగా చూడాలని భావించిన అల్లు అర్జున్ తాజాగా శాకుంతలం సెట్‌కి వచ్చారు. కూతురు పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోయారు. బన్నీతో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డ, కొడుకు అయాన్ కూడా సెట్‌కి వెళ్లారు. ప్రస్తుతం బన్నీ శాకుంతలం సెట్‌ని సందర్శించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాని ఎంతగా షేక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
#IconStaar @alluarjun pays a surprise visit to his daughter #AlluArha on the sets of #Shaakuntalam. He also interacted with the cast and crew and wished them the best.@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @DilRajuProdctns @GunaaTeamworks pic.twitter.com/LtstOTYiUl
— BA Raju's Team (@baraju_SuperHit) August 7, 2021