Buchi Babu Sana | ఎన్టీఆర్ కోసం ఉప్పెన డైరెక్టర్ కథ..!
తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్టందుకుని అగ్రదర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు సుకుమార్ (Sukumar ) శిష్యుడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana).
ఉప్పెన (Uppena)సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు సుకుమార్ () శిష్యుడు బుచ్చిబాబు సాన (Buchi Babu Sana). తొలి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్టందుకుని అగ్రదర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ దర్శకుడితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇప్పటికే చాలా సార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ బుచ్చి బాబుకు వచ్చిందని టాలీవుడ్ జనాలు కోడై కూస్తున్నారు.
బుచ్చిబాబు రెడీ చేసిన కథను సుకుమార్ కు వినిపించగా…అతడు ఇంప్రెస్ అయ్యాడట. యాక్షన్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కథను సిద్దం చేసినట్టు టాక్. తారక్ ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆ ఎన్టీఆర్ ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా తెరపైకి వచ్చిన అప్ డేట్ అఫీషియల్ కాకపోయినా..ఫ్యాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి కాంబోలో వచ్చిన ఉప్పెన బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి బుచ్చిబాబు తన రెండో సినిమాను ఏ రేంజ్లో హిట్టు కొట్టేలా చేస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

