బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘కథకళి’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసన్న కుమార్ నాని దర్శకుడు. మాన్యత ప్రొడక్షన్స్ పతాకంపై రవికిరణ్ కదిలిండి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక కొణిదెల క్లాప్‌నివ్వగా, హర్షిత్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో నడిచే క్రైమ్ థ్రిల్లర్ ఇదని, వినోదానికి కూడా ప్రాధాన్యత ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని, ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని నిర్మాత పేర్కొన్నారు. మధు దామరాజా, మైమ్ మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జితిన్ మోహన్, సంగీతం: పవన్, దర్శకత్వం: ప్రసన్నకుమార్ నాని.