Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు ఈ సినిమా చూసిన పలువరు సినీ ప్రముఖులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి చిత్రయూనిట్ ‘బ్రహ్మ కలశ’ అనే పాటకి సంబంధించి ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈశ్వరుని పుదోటని తీసుకువచ్చి భాంగ్ర రాజ్యంలో ప్రతిష్టించిన క్రమంలో ఈ పాట వస్తుంది. శివుడిని భక్తితో ఆరాధించే విధంగా, శక్తిమంతమైన సంగీతంతో ఈ పాట ఉంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. అబ్బి వి పాడాడు. రిషబ్ శెట్టి మార్క్ మేకింగ్‌తో, అజనీష్ లోక్‌నాథ్ సంగీతంతో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.