బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగా సాగింది. ఐదో వారం నామినేషన్ ప్రక్రియలో ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. లోబో (జెస్సీ, ప్రియాంకలు నామినేట్ చేశారు); సన్నీ (కాజల్, ప్రియ); విశ్వ (ఆనీ, షణ్ముఖ్); హమీదా (ప్రియాంక, సిరి); మానస్ (లోబో, శ్వేతా, షణ్ముఖ్); ప్రియ (సన్నీ, హమీదా); జెస్సీ (విశ్వ, రవి, మానస్, శ్రీరామ్); యాంకర్ రవి (జెస్సీ, కాజల్, సిరి, ఆనీ); షణ్ముఖ్ జస్వంత్ ని (సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ చేశారు).
ఈ సారి నామినేషన్లో అత్యధికంగా షణ్ముఖ్‌ను నామినేట్ చేశారు . జెస్సీ తప్ప అందరు అబ్బాయిలు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఈ దెబ్బకు షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశానన్నాడు. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్ అంటూ ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు.
నామినేషన్ పూర్తయ్యాక.. రవి..షణ్ముఖ్ మధ్య మళ్లీ చిచ్చు రేగింది. నీతో దూరంగా ఉంటున్నంత మాత్రం నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదని కాదు అంటూ రవితో మొహంపైనే అన్నాడు షణ్ను.దీనికి రవి.. అంత హార్ష్‌గా మాట్లాడకురా అని రిక్వెస్ట్ చేసినప్పటికీ అతడు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటి నుంచి చూస్తారు నా గేమ్.. ఇప్పటి వరకూ నా గేమ్ చూడలేదంటూ సవాల్ చేశాడు షణ్ముఖ్.