BB4 | తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పడం సరిపోదు. అలాంటి అద్భుతమైన కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను. గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చింది ఈ కాంబినేషన్. అది కూడా బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా అంటే బాక్సాఫీస్ దద్దరిళ్లిపోతుంది. గతేడాది ఇద్దరూ కలిసి చేసిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో కూడా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది అఖండ.
బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది అఖండ. దీనికి ముందు లెజెండ్, సింహా సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది బోయపాటి, బాలయ్య కాంబినేషన్. ఇలాంటి బ్లాక్ బస్టర్ జోడీ మరోసారి కలిసి పని చేయబోతుంది. అవును తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.
తాజాగా దసరా పండగను పురస్కరించుకుని BB4 షూటింగ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. షూటింగ్‌కు ప్రారంభానికి ముహార్తాన్ని ఖరారు చేశారు. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ దసరా శుభాకాంక్షలు. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీ4 సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. ఈ మాసివ్ ఎపిక్ కాంబినేషన్ గ్రాండ్ జర్నీ మొదలు కానుంది. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు చేశాం అంటూ 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ రాసుకోచ్చింది.
ఇక ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అఖండ తరువాత ఈ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం పొలిటికల్ టచ్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ అంటేనే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. మరి ఈసారి ఎలాంటి సంచలన సినిమాతో ఈ ఇద్దరూ రాబోతున్నారో చూడాలి.
#BB4 – NBK’s most expensive film yet is getting officially launched on 16th October. pic.twitter.com/EiMY8WyvFa
— Aakashavaani (@TheAakashavaani) October 12, 2024