Shah Rukh Vs Anushka shetty | బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక అరుంధతి, భాగమతి, దేవసేనగా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది అనుష్కా శెట్టి (Anushka shetty). చాలా గ్యాప్ తర్వాత పఠాన్‌తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాడు కింగ్ ఖాన్. అనుష్కా శెట్టి కూడా లాంగ్ గ్యాప్ తర్వాత Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘జవాన్’ (Jawan) సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. తాజాగా మహేశ్ బాబు పీ డైరెక్షన్లో వస్తున్న అనుష్కా శెట్టి సినిమా కూడా ఇదే తేదీన రాబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్, అనుష్కాశెట్టి సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
‘జవాన్’ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. జవాన్ నుంచి విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ.. DEALER OF DEATH క్యాప్షన్‌తో లుక్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో కనిపించనుంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
Miss శెట్టి మిస్టర్ Polishetty.. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..