Book My Show – Gadar 2 | సన్నీ డియోల్ (Sunny Deol), అమీషా పటేల్ (Ameesha Patel) ప్రధాన పాత్రల్లో నటించిన ‘గదర్-2’ (Gadar 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. 2001లో వచ్చిన యుద్ధ నేపథ్య ప్రేమకథ ‘గదర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బుక్ మై షో (Book My Show) బంఫర్ ఆఫర్ ప్రకటించింది.
రక్షాబంధన్ సందర్భంగా ఈ మూవీకి వెళ్లాలనుకునే ప్రేక్షకులకు బుక్ మై షో (Book My Show) బంపర్ ఆఫర్ ప్రకటించింది. గదర్ 2 సినిమాకు సంబంధించి 2 టిక్కెట్లు బుక్ చేసుకుంటే 2 టిక్కెట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దీనికోసం (GADAR 2) ప్రోమో కోడ్‌ను యూస్ చేయాలని బుక్ మై షో సోషల్ మీడియాలో తెలిపింది. కాగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 వరకే అని తెలిపింది.
Iss Raksha Bandhan, kijiye poore parivaar ke liye kuch khaas!
Book karein tickets under the ongoing offer of Buy 2 Get 2 using the code – GADAR2
*This offer ends on 3rd September, 2023.#Gadar2 in cinemas now. 🎞️@ZeeStudios_ @Gadar_Official… pic.twitter.com/3ih5cxEVQm
— Ramesh Bala (@rameshlaus) August 29, 2023
ఇప్పటికే ఈ చిత్రం హిందీలో ‘కేజీఎఫ్-2’ వసూళ్లను (435 కోట్లు) అధిగమించింది. కేవలం 16రోజుల్లోనే ‘గదర్-2’ ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ రికార్డుతో హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. కాగా.. ఈ చిత్రం హిందీ మార్కెట్లో 500కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకోవడం సాధ్యమేనేని అంచనా వేస్తున్నారు.