భారతీయ సినిమాకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ అని భావించే రోజులు పోయాయంటున్నారు బాలీవుడ్ (Bollywood) సీనియర్ నిర్మాత బోనీకపూర్ (Boney Kapoor). హిందీ సినిమాల ప్రాముఖ్యత రోజురోజుకీ తగ్గిపోతుంది. దక్షిణాది సినిమాల (South Indian Cinema)తో పోల్చి చూస్తే అంత ఆసక్తికరమైన కంటెంట్ రావడం లేదని అన్నారు. ఈ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సౌతిండియన్ సినిమాపై తనదైన స్టైల్లో ప్రశంసలు కురిపించారు.
కొంతమంది ముంబై సినిమాల విషయంలో మాత్రం మీరు ఆర్డర్ చేసినవి మాత్రమే మీకు వస్తాయి. అయితే సౌత్ సినిమాల విషయానికొస్తే మీకు రోటీ, దాల్-చావల్, చికెన్‌తో థాలీని అందిస్తాయి. చాలా వరకు దక్షిణాది సినిమాలు భారతీయ ప్రేక్షకుల కోసం తీసినవేనని బోనీకపూర్ అన్నారు. మలయాళం సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంను శాసిస్తుంది. థియేటర్లు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలోనూ తెలుగు సినిమా వాటికి బూస్ట్‌ను అందిస్తుందన్నారు.
ఇక తమిళ సినిమాలు డబ్బింగ్ వెర్షన్లతో నార్తిండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్ ఇండియా సినిమాలతో తన పవర్ ఏంటో చూసిస్తోందని చెప్పుకొచ్చారు బోనీకపూర్. బాలీవుడ్‌తో పోలిస్తే ఇపుడు దక్షిణాది సినిమాలే నిజమైన భారతీయ సినిమా అని అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో సౌతిండియా