Subrahmanyaa | టాలీవుడ్ నటుడు బొమ్మాళి రవిశంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సాయి కుమార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమాలో సోన్ సూద్ పశుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పి ఆ మూవీలోని ఫేమస్ డైలాగ్ బొమ్మాళిని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా రవిశంకర్ కొడుకు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే సాయి కుమార్ వారసుడిగా ఆది ఎంట్రీ ఇచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
తన కుమారుడు అద్వయ్(Advay)ను సుబ్రహ్మణ్య అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు రవిశంకర్. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అద్వయ్ ఒక వారియర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే తన కొడుకును లాంచ్ చేయడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు రవిశంకర్. కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.
Every once in a while, someone rises to break all barriers💥💥
Introducing #Advay in and as the fierce #Subrahmanyaa ❤️🔥#SubrahmanyaaFirstLook Launched by DR. SHIVA RAJ KUMAR @NimmaShivanna 😍
Wishing You All A Very Happy Ganesh Chaturthi ✨🙏@Ravishankar_66 @advayinaction… pic.twitter.com/EpmE9Wkv2y
— BA Raju’s Team (@baraju_SuperHit) September 7, 2024