Emergency | సినిమాలో చూపే ప్రతిదాన్ని నమ్మేంత అమాయకులా దేశ ప్రజలు..! కంగనా ‘ఎమర్జెనీ’ సర్టిఫికేషన్‌పై బాంబే హైకోర్టు వ్యాఖ్యలు..!
Emergency | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ నటించి తెరకెక్కించిన మూవీ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నది. వాస్తవానికి ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం కావడంతో వాయిదాపడింది.
Emergency | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ నటించి తెరకెక్కించిన మూవీ ఎమర్జెన్సీ. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నది. వాస్తవానికి ఇప్పటికే మూవీ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ జారీ చేయడంలో ఆలస్యం కావడంతో వాయిదాపడింది. తాజాగా ఎమర్జెనీ మూవీ టీమ్‌కి బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని మందలించింది. సృజనాత్మకత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. శాంతిభద్రతలకు ముప్పు ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంపై ఘాటు స్పందించింది.
ఎమర్జెన్సీకి సర్టిఫికెట్ జారీ చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జస్టిస్ బీపీ కొలబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 25లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ దేశ ప్రజలు సినిమాలో చూపించే ప్రతిదాన్ని నమ్మేంత అమాయకులని సీబీఎఫ్సీ భావిస్తుందా? అని సీబీఎఫ్‌సీని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయడంలో సీబీఎఫ్సీ జాప్యం చేస్తోందన్న పిటిషనర్ వాదనలపై.. చిత్ర సహ నిర్మాత కంగనా రనౌత్ స్వయంగా బీజేపీ ఎంపీ అని కోర్టు గుర్తు చేసింది.
అధికార పార్టీ సొంత ఎంపీకి వ్యతిరేకంగా పని చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ పాత్రను పోషించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా కంగనా వ్యవహరించింది. వాస్తవానికి ఎమర్జెన్సీ మూవీకి సర్టిఫికెట్ జారీ చేసేలా సీబీఎఫ్‌సీని ఆదేశించాలంటూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. సెప్టెంబర్ 6న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. శిరోమణి అకాలీదళ్ సహా పలు సిక్కు సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు.
Read Also :
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
Prabhas | ‘స్పిరిట్’కు 500 కోట్ల బడ్జెట్.. పోలీస్ అధికారి పాత్రలో ప్రభాస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

