Squid Game | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ (Squid Game). హ్వాంగ్ డాగ్ హ్యూక్ దర్శకత్వంలో వచ్చిన ఈ కొరియన్ సిరీస్‌లో డబ్బు కోసం సగటు మనిషి ఆడే నెత్తుటి ఆటను ఆసక్తికరంగా చూపించారు. ఆటలు ఆడేందుకు వచ్చిన 456 మందిని ఒక దీవికి తీసుకువెళ్లి అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే రెడ్‌లైట్, గ్రీన్‌లైట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు నిర్వహిస్తారు. ఇందులో నటించిన వాళ్లంతా గ్రీన్ డ్రెస్సులు ధరించి కనిపిస్తారు. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ‘స్క్విడ్ గేమ్’ ఏఐ వెర్షన్లో ఇండియన్ సినీ స్టార్స్ పాల్గొంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ గేమ్‌లో బాలీవుడ్ మాజీ ప్రేమికులు (Bollywood ex couples) పాల్గొన్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. హృతిక్ రోషన్ – కంగన రనౌత్, సల్మాన్ ఖాన్ – ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్ కపూర్ – కత్రినా ఖైఫ్, షాహిద్ కపూర్ కరీనా కపూర్,.. టైగర్ ష్రాఫ్ – దిశా పటానీ, జాన్ అబ్రహం- బిపాస బసు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ – రేఖ జంటలు ఈ గేమ్‌లో పాల్గోన్నారు. అయితే ఇందులో విలన్లుగా.. అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్.. అలీయా భట్, సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోనే, వివేక్ ఒబెరాయ్ నటించారు. కాగా.. ఏఐ ఆధారంగా సృష్టించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.
WTF IS THIS ???? 😭😭😭 pic.twitter.com/WjnCbaK4Sz
— Pranab (@i_hrithik_simp) January 18, 2025