దీపికా పదుకోన్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులమీద పోస్టులు పెడుతున్నారు. ఎందుకీ శుభాకాంక్షలు? అనుకుంటున్నారా!. దీపిక తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రణబీర్, దీపికా కలిసి తమ ఇన్‌స్టా ద్వారా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పేశారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్ ఇచ్చినట్టు తన పోస్ట్‌లో పొందుపరిచారు దీపిక. ‘మా ఇద్దరికీ పిల్లలంటే ప్రాణం. పిల్లలతో ఇల్లు కళకళలాడే రోజుకోసం ఎదురుచూస్తున్నాం’ అని సంతోషం వ్యక్తం చేశారు దీపిక. ఇంకా చెబుతూ ‘మా పిల్లల్ని సెలబ్రిటీ స్టేటస్‌కి దూరంగా పెంచాలని నిర్ణయించుకున్నాం.
మా తల్లిదండ్రులు నన్నెంతో క్రమశిక్షణతో పెంచారు. రణబీర్ కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగాడు. అందుకే.. మా పిల్లల్ని కూడా క్రమశిక్షణగా బాధ్యత గల భారతపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు దీపిక. ఇదిలావుంటే.. ‘రామ్‌లీల’(2013)లో తొలిసారి జతకట్టిన ఈ జంట.. ఆ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు. 2018 నవంబర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పటికే మంచి జంటగా అందరి మన్ననలనూ అందుకున్న ఈ జంట తల్లిద్రండులు కావడం నిజంగా శుభవార్తే.