బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ ఆదిత్యాధర్ (Aditya Dhar), విక్కీ కౌశల్ (Vicky Kaushal ) కాంబోలో అశ్వత్థామ (Ashwatthama) సినిమాకు ఇప్పటికే ప్లాన్ చేశాడు నిర్మాత రొన్నీ స్క్రూవాలా. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రాబోయే ఈ చిత్రంలో సారా అలీఖాన్ (Sara Ali Khan) ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి రాకుండా ఆలస్యం కానుంది. నిర్మాత రోన్నీ స్క్రూవాలా దీనిపై ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘స్కిప్ట్ చివరి డ్రాప్ట్‌లో ఉన్న సినిమా లక్ష్యం, బడ్జెట్‌కు సరిపోకపోవడం, కోవిడ్ వల్ల నెలకొన్న పరిస్థితుల కారణంగా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆదిత్యాధర్, విక్కీ కౌశల్, నేను ఈ ప్రాజెక్టును మరో 6 నుంచి 9 నెలల వరకు వాయిదా వేయాలనుకుంటున్నామని’ రోన్నీ స్క్రూవాలా తెలిపారు. సారా అలీఖాన్ కూడా అంగీకరించింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ మ్యాగ్నమ్ ఓపస్ సినిమాను బడ్జెట్ పై మరింత ఫోకస్ పెట్టి సరైన సమయంలో సెట్స్ పైకి తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్లోబల్ ఫిల్మ్ గా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాడు ఆదిత్యాధర్. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ను భవిష్యత్ తరాలకు అందించేలా ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. రానున్న రోజుల్లో స్క్రిప్ట్ వర్క్, వీఎఫ్ ఎక్స్ పనులు, బడ్జెట్ పై సమావేశం కానున్నారు విక్కీ కౌశల్ అండ్ టీం. అన్నీ అనుకుంటున్నట్టుగా కుదిరిన వెంటనే సెట్స్ పై తీసుకెళ్లనున్నారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర