Sanjay Dutt | సినిమా షూటింగ్లో ప్రమాదం.. ప్రముఖ నటుడికి గాయాలు !
Sanjay Dutt | కన్నడ నటుడు ధ్రువ సర్జా నటిస్తున్న కేడీ.. ది డెవిల్ (KD The Devil)లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది.
Sanjay Dutt | కన్నడ నటుడు ధ్రువ సర్జా ప్రస్తుతం కేడీ.. ది డెవిల్ (KD The Devil) చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. బెంగళూరులో షూటింగ్ కొనసాగుతుండగా జరిగిన ప్రమాదంలో సంజయ్‌దత్‌కు గాయాలయ్యాయి. మాగడి రోడ్ ప్రాంతంలో స్టంట్ డైరెక్టర్ రవి వర్మ కంపోజిషన్‌లో కీలక ఫైట్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా బాంబు పేలుడుకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేస్తుండగా..ఈ ఘటన జరిగినట్టు సమాచారం.
ఈ ప్రమాద ఘటనతో ధ్రువ సర్జా టీం వెంటనే షూటింగ్ నిలిపేసింది. సంజయ్ దత్‌కు చికిత్సనందించగా ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారని, త్వరలోనే షూట్‌ను మళ్లీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవిచంద్రన్, బాలీవుడ్ భామ శిల్పాశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్.. చాఫ్టర్ 2 సినిమాతో సంజయ్‌దత్ శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
డెబ్యూ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేడీ.. ది డెవిల్ చిత్రం కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంజయ్‌దత్ ప్రస్తుతం తమిళ్ డెబ్యూ ప్రాజెక్ట్ లియోలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు The Good Maharaja, Ghudchadi, Baap చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.
Read Also :
Dheekshith Shetty | నవదీప్‌తో దసరా యాక్టర్ దీక్షిత్ శెట్టి తెలుగు ప్రాజెక్ట్.. వివరాలివే
Bobby Kolli | బాబీ క్రేజీ అప్డేట్.. నిన్న మెగాస్టార్.. నేడు సూపర్ స్టార్
Birth Of Bhuvana Vijayam | ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్‌గా సునీల్.. భువన విజయమ్ వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

