Salman Khan | అరెరె ఎంత పనయింది… ఆ అమ్మాయి నాన్న ఒప్పుకునుంటే సల్మాన్‌ఖాన్‌కు పెళ్లయిపోయేది!
Salman Khan-Juhim Chawla | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ నుంచి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఐదు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతున్నాడు.
Salman Khan-Juhim Chawla | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఐదు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతున్నాడు. ఇక బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో సల్మాన్ తొలిస్థానంలో ఉంటాడు. ఆయనను నిదర్శంగా తీసుకుని ఎందరో నటులు బ్యాచ్‌లర్ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా సల్మాన్ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. కాగా తాజాగా సల్మాన్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
స్వయంగా సల్మాన్ తన ప్రేయసి గురించి ఆ వీడియోలో వెల్లడించాడు. బాలీవుడ్ సీనియర్ నటి జూహీ చావ్లాను పెళ్లిచేసుకోవాలనుకున్నాని, ఇదే విషయం వాళ్ల నాన్నకు చెప్తే తను అంగీకరించలేదని సల్మాన్ చెప్పాడు. ఎందుకు అని యాంకర్ అడుగగా.. నేను వాళ్లకు సరిపోనని అనుకున్నారేమో అంటూ నవ్వుతూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కాగా ఈ వీడియో ఇప్పటిది కాదు. పాతికేళ్ల క్రితంది. అప్పుడు ఓ ఇంటర్వూలో భాగంగా సల్మాన్ ఇలా సరదాగా తన లవ్‌స్టోరీ గురించి చెప్పాడు. తాజాగా సల్మాన్ అభిమాని ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ వీడియోపై పలువురు నెటీజన్లు వాళ్ల నాన్న ఒప్పుకుంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక సల్మాన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టైగర్-౩ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Wordle 631 4/6
⬜⬜⬜⬜🟨
⬜🟨⬜🟨⬜
🟨🟨⬜⬜⬜
🟩🟩🟩🟩🟩— Arshi Siddiqui (@Arshi_E_Sid) March 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

