Arjun Rampal In NBK108 | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రస్తుతం అదే జోష్‌లో వీరసింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. శ్రీలీల కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మేకర్స్ బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్‌ను ఎంపికచేశారట. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న NBK108 వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రంలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో నటించనున్నాడు. బాలయ్య కూతురులా శ్రీలీల నటించనుంది. ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా అంజలి నటించనున్నట్లు టాక్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.