అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్ రోల్లో యువ గాయకుడు కృష్ణచైతన్య నటిస్తున్నారు. సి.హెచ్. రామారావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర పోస్టర్‌ను శనివారం ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆవిష్కరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నేను ఎంతగానో అభిమానించే ఘంటసాలగారి జీవిత కథతో సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నా. మహా గాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన పడిన కష్టాలను, పాటల ప్రయాణంలో సాధించిన విజయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అన్నారు. ఘంటసాల జీవితంలోని తెలియని కోణాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ఘంటసాల పాత్రధారి కృష్ణచైతన్య పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళీధర్, సంగీతం: వాసూరావు సాలూరి, విజువల్ ఎఫెక్ట్స్: శ్యామ్‌కుమార్, నిర్మాత: శ్రీమతి ఫణి, దర్శకత్వం: సి.హెచ్.రామారావు.