Biker | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘బైకర్’.. వీక్డేస్లోనూ పెరుగుతున్న కలెక్షన్లు!
Biker | టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన ఐదు రోజుల్లోనే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.
Biker | టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన ఐదు రోజుల్లోనే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. సాధారణంగా ఏ సినిమా అయినా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి. కానీ ‘బైకర్’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రోజు రోజుకూ ఈ సినిమా పుంజుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది.
ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సోమవారం రోజు బుక్‌మైషోలో సుమారు 15.6 వేల టిక్కెట్లు అమ్ముడవ్వగా, మంగళవారం ఈ సంఖ్య 17.2 వేలకు పెరగడం విశేషం. భారీ పోటీ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాపై చూపిస్తున్న ఆసక్తి సినిమా విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటించగా, సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించారు. అలాగే అతుల్ కుల్కర్ణి కూడా తన నటనతో ఆకట్టుకున్నారు.
ఇక సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్‌లలో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతోందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాన్సెప్ట్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపిన ‘బైకర్’ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

