Bigg Boss: 19 మంది కంటెస్టెంట్స్‌లో ఎవరు బెస్ట్, ఎవరు వరస్ట్

గత సీజన్స్‌లో కన్నా ఈ సీజన్లో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. శుక్రవారం వినాయక చవితి కావడంతో అందరు సంప్రదాయబద్ధంగా కనిపించారు. హౌజ్‌మేట్స్ అందరు సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా జరుపుకున్నారు. అయితే ఈ సారి ఫ్యామిలీస్‌తో లేనందుకు ఒకింత బాధపడ్డారు. ఇక గణపతి పూజ అనంతరం బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు పాల్గొనాల్సి ఉండగా హౌస్మేట్స్ విశ్వ, శ్రీరామచంద్ర పేర్లను సూచించారు.
అయితే తనను సెలక్ట్ చేయకపోవడంపై నటరాజ్ మాస్టర్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏదేమైన విశ్వ, శ్రీరామచంద్ర ఈ వారానికి సరిపడా సరుకులు సమకూర్చారు. అనంతరం ఈవారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఆదేశించాడు. మొదటగా రవి.. లోబో బెస్ట్ పర్ఫామర్ అని, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని పేర్కొన్నాడు. లోబో.. యానీ మాస్టర్ బెస్ట్ అని.. తెలిసో, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు.
జెస్సీ .. సిరిని బెస్ట్, రవిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేశాడు. శ్వేత వర్మ.. విశ్వ బెస్ట్, ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. ఉమాదేవి.. విశ్వ బెస్ట్‌గా, కాజల్ వరస్ట్ అని చెప్పింది. సిరి.. నటరాజ్ మాస్టర్ బెస్ట్, ఉమాదేవి వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. విశ్వ .. ప్రియాంక సింగ్ బెస్ట్ అని , కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా సూచించాడు.
లహరి.. విశ్వ బెస్ట్ పర్ఫామర్ అని, కాజల్ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పుకొచ్చింది.ప్రియాంక సింగ్.. లోబో బెస్ట్ పర్ఫామర్ అని, ఉమాదేవిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రియాంక, ఉమా దేవి మధ్య పెద్ద గొడవే జరిగింది. పింకీ తాను కోపంలో షటప్ అని అనేసింది. తప్పు తెలుసుకొని వెళ్లి సారీ చెప్పింది
యానీ మాస్టర్.. పింకీ బెస్ట్, జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని చెప్పింది. సరయూ.. లోబోను బెస్ట్ పర్ఫామర్‌గా , జెస్సీని వరస్ట్ పర్ఫామర్‌గా సూచించింది.మొత్తానికి 19 మంది కంటెస్టెంట్స్ అభిప్రాయాల ప్రకారం ఎక్కువ ఓట్లతో విశ్వ బెస్ట్ పర్ఫామర్‌గా, జెస్సీని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు.వరస్ట్ పర్ఫార్మర్ అయిన జెస్సీని జైల్లో పెట్టడంతో అతను చాలా కుమిలిపోయాడు.అయితే మేమందరం నీతోనే ఉంటాం అని అతనికి ధైర్యం చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

