Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే హౌస్‌లోకి 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని నాగార్జున బాంబు పేల్చడంతో హౌస్ నుంచి ఎవరు వెళతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే ఈ షో నేటికి 26వ రోజుకి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వహాకులు విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తే.. బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కి కొత్త రకం టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ప్రోమో మొదలుకాగానే బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు ఆహారం నిల్వ చేసుకునే టైం వచ్చేసింది. ఎవరు, ఎంత ఎక్కువగా నిలువ చేసుకోగలరు అనేది మీరు చేసే పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటూ చెప్పారు. అందులో భాగంగా ‘గెస్ ది సౌండ్స్’ అనే టాస్క్ పెట్టి, కొన్ని సౌండ్స్ లో వినిపించారు. ఈ సౌండ్స్‌ని గుర్తుపెట్టుకుని వరుస క్రమంలో రాయాలి అని చెప్పాడు. ముందుగా కాంతారా క్లాన్ నుంచి ప్రేరణ, నైనిక.. శక్తి క్లాన్ నుంచి నిఖిల్, మణికంఠ టెస్ట్‌కి సిద్ధమైపోయారు. బిగ్ బాస్ సౌండ్స్ మొదలు పెట్టగానే వరుసగా రూస్టర్, ఫైర్ వర్క్, ఎలిఫెంట్, గోట్ చేసే సౌండ్స్ వినిపించారు. దీంతో నలుగురూ కలిసి రాయడం స్టార్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ తాను చేసిన సౌండ్ రిజల్ట్స్ చూపించగా, ప్రేరణ తను రూస్టర్ కరెక్ట్ గా రాసానంటూ ఎగిరి గంతేసింది. కానీ అక్కడ ఫైర్ వర్క్స్ ప్లేస్ లో ప్రేరణ గన్ అని రాయడంతో నబిల్.. మణికంఠ, ప్రేరణ ఇద్దరికి జీరో మార్క్స్ ఇచ్చాడు.
అనంతరం విష్ణు ప్రియ వర్సెస్ సోనియా, కిరాక్ సీత వర్సెస్ యష్మి గౌడ ఆడారు. వీరికి బిగ్ బాస్ మళ్లీ పలు సౌండ్స్ వినిపించారు. ఆ తర్వాత మంకీ, గాడిద ఎలా అరుస్తాయో చెప్పండి అంటూ కిరాక్ సీతను బిగ్ బాస్ అడిగాడు. కానీ సీత వింతగా సౌండ్ చేసి, ఆ తర్వాత నా వాయిస్ కూడా గాడిద వాయిస్ లాగే ఉంటుంది బిగ్ బాస్ అంటూ కామెంట్ చేసింది. వెంటనే మణికంఠ సేమ్ గాడిద లాగే సౌండ్ చేయడంతో పర్ఫెక్ట్ అంటూ అందరూ నవ్వేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది.