Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చేరుకుంది. ఇక ఎనిమిదో వారం ఎవరు ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు. రాయల్ క్లాన్ నుంచి మెహబూబ్, నయని పావనిలు ఉన్నారు. ఇందులో ఈ వారం అత్యధిక ఓటింగ్ నిఖిల్‌కు ఉండడంతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ప్రేరణ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే అందరికంటే తక్కువ ఓటింగ్ ఉన్న నయని పావని ఈవారం ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాగార్జున నయనిని సేవ్ చేసి, మెహబూబ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఇక ఎలిమినేషన్ అనంతరం మెహబూబ్ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
ఇదిలావుంటే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం హౌజ్ నుంచి మెహబూబ్ వెళ్లగా.. సోమవారంకు సంబంధించిన ప్రోమలో ముక్కు అవినాష్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రోమోలో ముక్కు అవినాష్ తనకు భరించలేక కడుపునొప్పి ఉందని, తాను చాలా ఇబ్బంది పడుతున్నాయని, ఆ కారణంతో తాను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నాను అంటూ అందరికీ షాక్ ఇస్తాడు. అయితే అతడు ఎలిమినేట్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
మరోవైపు దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ సందడి సందడిగా మారింది. శనివారం రోజు.. కంగువా మూవీ ప్రమోషన్ లో భాగం సూర్య బిగ్ బాస్ హౌజ్‌కి రాగా.. ఆదివారం ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ మూవీ టీం, అమరన్ మూవీ టీం, కిరణ్ అబ్బవరం క మూవీ టీంలు వచ్చి సందడి చేశారు. ఇంకా వీళ్ళే కాకుండా… అనసూయ, సమీరా భరద్వాజ్, హైపర్ ఆది అదిపోయే రేంజ్ లో పార్మామెన్స్ లు ఇచ్చారు.